పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి అందరూ షాక్.. పోలీసు కేసు నమోదు

by Sumithra |   ( Updated:2023-12-17 17:16:46.0  )
పెళ్లి మండపంలో వధువు చేసిన పనికి అందరూ షాక్.. పోలీసు కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఓ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..?. వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని జెత్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పెళ్లి టైమ్ కావస్తోంది. ఇంతలో వధువు రూపా పాండే మండపానికి వచ్చింది. స్టేజ్ ఎక్కే క్రమంలో వధువు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది.

ఆ తర్వాత వరుడి చేయి పట్టుకుని చిరు నవ్వులు చిందిస్తూ పెళ్లి మండపంపైకి వచ్చింది. అనంతరం వధూవరులను.. అక్కడున్న కుటుంబసభ్యులు, బంధువులు.. చప్పట్లతో ఆహ్వానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. తుపాకీతో కాల్పులు జరిపిన కారణంగా వధువు రూపా పాండేపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ తోమర్ తెలిపారు. అంతే కాకుండా ఆ తుపాకీ లైసెన్సు కూడా రద్దు చేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story