పెళ్లింట తీవ్ర విషాదం

by Shyam |
పెళ్లింట తీవ్ర విషాదం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సంతోషంగా కూతురి పెళ్లి చేశారు. ఇంతలోనే ఇంటి పెద్ద మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన సాధీక్ అనే వ్యక్తి గురువారం పెబ్బేరు కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తన కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం హోలిమ కార్యక్రమానికి నీళ్లలో పూజా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. దీంతో అతను పెబ్బేర్ దగ్గరగా ఉన్న పీజేపీ కాలువలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లారు. కాలువలోకి దిగుతున్న సమయంలో వర్షం కారణంగా జారి కిందపడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

Next Story