- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన మెుదటి రోజే షాక్ ఇచ్చిన భార్య.. ప్రియుడితో కలిసి..
దిశ, వెబ్ డెస్క్: పెళ్లైన మరుసటిరోజే భర్తకు షాక్ ఇచ్చిందో భార్య. పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి వచ్చిన ఆ ఇల్లాలు ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కమ్మవారిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఇటీవలే మరణించింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ కోసం గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళలను గ్రామ పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి అయిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి వరుడు అయినటువంటి కేశవమురళి ఇంటి వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయారు. అత్తింటికి వచ్చిన ఆ మహిళ కనీసం 24 గంటలు కూడా కాపురం చేయలేదు. వచ్చిన రోజే ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. భర్త కేశవమురళి ఆమె తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు తెలియజేశారు. అంతా వెతకడం మెుదలు పెట్టారు. అయితే ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకున్న కేశవమురళి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.