- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు మాకు ఇచ్చేది ఏంటి.. తాళాలు బద్దలుకొట్టి డబుల్ ఇండ్లలోకి గృహప్రవేశం
దిశ, జగిత్యాల : మల్యాల మండలం నూకపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగులగొట్టి శుక్రవారం లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు.
ఏడాది కిందటే కాంట్రాక్టర్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా జిల్లా అధికారులు పరిశీలించి గత సంవత్సరం దసరా పండుగకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని అధికారులు ప్రకటించారు. తీరా అది జరగకపోవడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు శుక్రవారం తాళలు పగలగొట్టారు.
అయితే నూకపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం 65 మంది ఇండ్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసింది. 2020 దసరా పండుగకు లబ్ధిదారులకు అప్పజెప్పడం జరుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ అధికారులు ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో గుడిసెల్లో ఉంటూ పాములు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే, అధికారులు మాట నిలుపుకోలేదనే కోపంతో శుక్రవారం 19 ఇండ్ల తాళలు పగులగొట్టి గృహప్రవేశం చేశారు.
ఇండ్ల ముందు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, ఇండ్లను శుభ్రం చేసుకొని అక్కడే ఉన్నారు.
విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి అడుగగా గత ఏడాదే చొప్పదండి ఎమ్మెల్యే మాకు గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో మేమే గృహప్రవేశాలు చేసుకున్నామని అన్నారు.
అయితే సంబంధిత అధికారులు.. అధికారికంగా త్వరలోనే పూర్తి స్థాయిలో గృహ ప్రవేశాలు చేయిస్తారని వారు చెప్పారు. ఈ క్రమంలో లబ్ధిదారులు మేము ఇండ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, అధికారులు తమను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో నూకపల్లి కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తగా మల్యాల పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు.