- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING : తమ్మినేని హెల్త్ కండీషన్‌పై మరో బులెటిన్ విడుదల.. రాబోయే 48 గంటలే కీలకం
దిశ, వెబ్‌డెస్క్ : హార్ట్ అటాక్‌తో ఏఐజీలో చేర్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హల్త్ కండీషన్‌పై వైద్యులు ఇవాళ మధ్యాహ్నం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ ద్వారా చికిత్స అందజేస్తున్నామని పేర్కొ్న్నారు. చికిత్సకు వెర్బల్ కమ్యూనికేషన్‌కు ద్వారా ఆయన స్పందిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేమని, రాబోయే 48 అత్యంత కీలకమని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. కాగా, తమ్మినేని గుండె, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల నుండి నీరు బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఇవాళ తమ్మినేని ఖమ్మం జిల్లాలోని తన సొంత నివాసంలో గుండె పోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.