ChatGPT : ప్రముఖ చాట్ జీపీటీ క్రాష్ డౌన్

by M.Rajitha |
ChatGPT : ప్రముఖ చాట్ జీపీటీ క్రాష్ డౌన్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన చాట్ జీపీటీ(Chat GPT) సేవల్లో అంతరాయం(Crash Down) ఏర్పడింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాయంతో నడిచే చాట్ బాట్(Chat Bot) లో ఒకటైన చాట్ జీపీటీని ప్రపంచం మొత్తం మీద ఎక్కువమంది వినియోగిస్తున్నారు. కాగా దీని క్రాష్ డౌన్ తో యూజర్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ(OPEN AI) మాత్రం ఈ అంతరాయంపై ఇంతవరకు నోరు విప్పలేదు. చాట్ బాట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్ ఉద్యోగులంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, కోడింగ్ విషయాల్లో చాట్ జీపీటీ సర్వీసులు వాడుతుండటంతో.. వారి పనులన్నీ ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed