- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా టార్గెట్ రేవంత్ రెడ్డే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : తన పంచాయతీ రేవంత్‌తోనేనని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడుకునే వీలుంటుందని, పదవులు కోత అనేది స్పోర్టివ్‌గా తీసుకుంటానన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దేశానికి కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందన్నారు. అయితే తన పంచాయితీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, మెదక్ పర్యటనకు రేవంత్ తనను పిలవలేదని చెప్పారు.
రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడతానన్నారు. తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు.
నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావమని జగ్గారెడ్డి అన్నారు. ''ఏపీ విభజన వద్దని నిజం మాట్లాడి తెలంగాణ ద్రోహిగా పేరు మోశాను. కాంగ్రెస్‌పై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ. మెదక్ పర్యటనకు వెళ్తే నన్ను రేవంత్ ఆహ్వానించలేదు. దీంతో నాకు కోపం వచ్చింది. 3సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా?'' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తన ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను జగ్గారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు.
పంచాయితీ రేవంత్‌తో మాత్రమేనని కాంగ్రెస్‌తో కాదని చెప్పారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించాడు. 20 రోజుల క్రితం రేవంత్ ఫోన్ చేశారని, మెదక్ సీఎస్‌ఐ చర్చికి వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు.