BREAKING : వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్‌తో సీఎం రేవంత్ భేటీ.. సీ4ఐఆర్‌‌పై ఉమ్మడి ప్రకటన

by Shiva |   ( Updated:2024-01-16 14:37:50.0  )
BREAKING : వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్‌తో సీఎం రేవంత్ భేటీ.. సీ4ఐఆర్‌‌పై ఉమ్మడి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో వివిధ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ప్రెసిడెంట్ అధ్యక్షుడితో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం (సీ4ఐఆర్‌) ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక ఫోరం అలోచనలు, సంస్కరణలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. సీ4ఐఆర్‌తో ముఖ్యంగా ప్రజారోగ్యం, సాంకేతికత, మెరుగైన జీవితం కల్పించడం వంటి లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని వెల్లడించారు. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టండి ‘తెలంగాణ పెవిలియన్‌’ పేరుతో ఓ స్టా్ల్‌ను కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణలో ‘పెట్టుబడి పెట్టండి’ పేరుతో పెవిలియన్‌ రూపొందించారు. ఆ స్టాల్ బ్యాక్‌గ్రౌండ్‌లో రాష్ట్ర సంస్కృతి, సాంకేతిక సృజనాత్మకతను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్‌, పోచంపల్లి ఇక్కత్‌, చేర్యాల పెయింటింగ్స్‌, టీ హబ్‌ పేరుతో ఓ ప్రతకమైన వాల్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed