ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు..

by Disha Newspaper Desk |
ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు..
X

దిశ, నకిరేకల్: తెలంగాణ శ్రీశైల క్షేత్రంగా పేరొందిన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి శుక్రవారం ఆలయ చైర్మన్ మేకల అరుణ అందజేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుంచి 13వ వరకు జరగనున్నాయని వివరించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు దేవాలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మహేంద్ర కుమార్, పాలకవర్గ సభ్యులు పసునూరి శ్రీనివాస్, రాధారపు బిక్షపతి, అర్చకులు సురేష్ శర్మ, సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed