BREAKING : కృష్ణా జిల్లా పనమలూరులో దారుణం.. కొంపముంచిన కోడి పందేలు, ఇరు వర్గాల ఘర్షణ

by Shiva |   ( Updated:2024-01-17 01:51:33.0  )
BREAKING : కృష్ణా జిల్లా పనమలూరులో దారుణం.. కొంపముంచిన కోడి పందేలు, ఇరు వర్గాల ఘర్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో పలు జిల్లాలో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పనమలూరులో నిర్వహిస్తున్న కోడి పందాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కంకిపాడు మండలం ఉప్పులూరు బరిలో ఉన్నట్టుండి వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రైల్వే‌ట్రాక్‌పై రాళ్లు రువ్వుకున్నారు. అనుకోని పరిణామంతో కోడి పందేలు ఆడేందుకు, వీక్షించేందుకు వచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

Next Story