BREAKING : జ్ఞాన్‌వాపీ కేసులో కీలక మలుపు.. వారణాసి కోర్టు కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-01-24 11:24:48.0  )
BREAKING : జ్ఞాన్‌వాపీ కేసులో కీలక మలుపు.. వారణాసి కోర్టు కీలక వ్యాఖ్యలు
X

వెబ్‌డెస్క్: జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వేకు సంబంధించి సీల్డ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే విషయంపై ఇవాళ వారణాసి జిల్లా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సర్వే రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. అదేవిధంగా కేసులోని ఇరు పక్షాలకు నివేదికను అందజేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, మసీదు ప్రాంగణంలోని శాస్త్రీయ సర్వేపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శ్రద్ధగా వెయ్యి పేజీల సమగ్ర నివేదికను రూపొందించింది. దానిని గత సంవత్సరం డిసెంబర్ 18న వారణాసి కోర్టుకు సమర్పించింది.

కాగా, వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు స్థానంలో హిందూ దేవాలయం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటూ కొందరు హిందూ మహిళ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు మసీదులో సర్వే జరిపితే వాస్తవం బయటపడుతుందని పిటిషనర్ల వాదన మేరకు వారణాసి కోర్టు సర్వేకు అనుమతిచ్చింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. తాత్కాలిక స్టే విధిస్తూ వారణాసి కోర్టుకు వెళ్లాలని సూచించింది.

న్యాయపరమైన ప్రయోజనాలకై సర్వే అవసరముందని కోర్టు అభిప్రాయపడింది. సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఇప్పుడు వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకు అనుమతిచ్చింది. సెషన్స్ కోర్టు తిర్పును సమర్ధించి, మసీదు కమిటీ పిటీషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా మసీదులో చేపట్టిన సైంటిఫిక్ సర్వే నివేదికను అర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సీల్డ్ కవర్‌లో వారణాసి కోర్టుకు సమర్పించారు.

Advertisement

Next Story

Most Viewed