మహానగరంలో మాయగాడు.. కారుకు MLA స్టిక్కర్ వేసి ఏం చేశాడంటే..

by Anukaran |   ( Updated:2021-10-12 01:52:22.0  )
మహానగరంలో మాయగాడు.. కారుకు MLA స్టిక్కర్ వేసి ఏం చేశాడంటే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కితే చాలు చలానా పడాల్సిందే. అయితే, కొందరు వాహనదారులు చలానా నుంచి తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను మూసేయడం, చెరిపేయడం చేస్తుంటారు. కానీ, హైదరాబాద్‌లో ఓ వాహనదారుడు (TS10 EQ 6999 ) ఏకంగా MLA స్టికర్ వేసుకుని దర్జాగా రోడ్డెక్కేశారు.

MLA స్టిక్కర్ ఉన్న కారణంగా పోలీసులు ఆ కారును ఆపేందుకు వెనకడుగేస్తుండటంతో ఆడిందే ఆట అన్నట్లుగా విచ్చలవిడిగా ట్రాఫిక్ నిబంధనలను బ్రేక్ చేస్తున్నాడు. అనూహ్యంగా ఈ వాహనం తార్నాక స్ట్రీట్‌ నంబర్‌ 1లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం వద్ద సామాజిక వేత్త విజయ్ గోపాల్ కంట పడటంతో రాంగ్ రూట్‌లో పార్క్ చేసిన వాహనంపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ట్విట్టర్ ద్వారా కోరారు. తీరా చూస్తే TS10 EQ 6999 నెంబర్ కారుపై 15 పెండింగ్ చలాన్లు ఉండగా.. రూ.13,025 చెల్లించాల్సి ఉంది. అందులో 9 అతివేగంగా వాహనం నడిపినందుకు, 3 సిగ్నల్‌ జంపింగ్‌, 3 రాంగ్‌ పార్కింగ్‌లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed