హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆనందయ్య మందుకు పంపిణీకి బ్రేక్.!

by srinivas |
anandayya-Medicine
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును కనుగొన్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ మందుపై కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆనందయ్య మందుపై హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మందు పంపిణీపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

కంట్లో వేసే మందులో హానికర రసాయనాలు ఉన్నట్టు పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టులో విచారణ సందర్భంగా.. ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. చుక్కల మందును 5 ల్యాబ్‌ల్లో పరీక్షించినట్టు వెల్లడించారు. అనంతరం కోర్టు.. ల్యాబ్‌ల నివేదిక తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో పిటిషనర్ చుక్కల మందును ఆయుష్ కేంద్రంలో పరీక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed