బుల్లితెరపై హాస్య బ్రహ్మ..

by Shyam |   ( Updated:2020-07-03 02:35:04.0  )
బుల్లితెరపై హాస్య బ్రహ్మ..
X

హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం సినిమాలకు స్వస్తి చెప్పనున్నాడా? వెండితెరకు గుడ్ బై చెప్పి పూర్తిగా బుల్లితెరపై కాన్సంట్రేట్ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తనదైన కామెడీ టైమింగ్‌తో దాదాపు ముప్పై ఏళ్లకు పైగా తెలుగు ప్రజలను నవ్వించిన బ్రహ్మానందం.. అనారోగ్య కారణాల వల్ల చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన కామెడీతో సినిమాలను నిలబెట్టే బ్రహ్మి కోసం.. డైరెక్టర్లు ప్రత్యేకంగా సీన్స్ క్రియేట్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇన్నాళ్లు బిగ్ స్క్రీన్‌పై జోరు చూపించిన బ్రహ్మి.. ఇకపై స్మాల్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ డైలీ సీరియల్‌కు సైన్ కూడా చేశారని సమాచారం. ఇందులో ఆయన పాత్ర భిన్నంగా ఉంటుందని సమాచారం.

బుల్లితెరపై కనిపించాలన్న బ్రహ్మానందం నిర్ణయంతో చాలా మంది సీరియల్ దర్శకులు తనను కలిశారని.. ఆయన గురించి ప్రత్యేకంగా కథలు కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. బ్రహ్మి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించే చాన్స్ కూడా ఉందని సమాచారం. సినిమాలతో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించిన బ్రహ్మానందం.. సీరియల్స్‌లోకి వస్తే మాత్రం ప్రతి ఇంటా ప్రతిరోజూ నవ్వులే అంటూ ప్రేక్షకులు ఆనందపడిపోతున్నారు.

Advertisement

Next Story