వరంగల్ సీపీ రవీందర్‌కు సన్మానం

దిశ, వరంగల్: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ వరంగల్ విభాగం సభ్యులు.. గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా. రవీందర్‎ను ఘనంగా సన్మానించారు. లాక్‎డౌన్ సమయంలో కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాధిని నియంత్రించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరుపై కృతజ్ఞతలు తెలిపేందుకు సమాఖ్య సభ్యులు పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేమం కోసం పండితులు వేద అశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు మోత్కూర్ రాము, ప్రధాన కార్యదర్శి ఐనవోలు ప్రవీన్ శర్మ, కోశాధికారి విష్ణుదాసు వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement