- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దుకాణానికి వెళ్లి తిరిగిరాని బాలుడు?

X
దిశ, సూర్యాపేట: దీపావళి పండుగ రోజున అగ్గిపెట్టె కోసం కిరాణా షాపుకు వెళ్లిన ఓ బాలుడు తిరిగి రాలేదు. స్థానికుల కథనం ప్రకారం.. వరికపల్లి మహేష్ కుమారుడు గౌతమ్ జిల్లాలోని భగత్ సింగ్ నగర్ లో నివాస ముంటున్నారు. శనివారం సాయంత్రం 7గంటల సమయంలో పండుగ సందర్భంగా తల్లిదండ్రులు ఆరు బయట నిల్చున్నారు.
దీంతో అగ్గిపెట్టె కోసం సమీపంలోని కిరాణాషాపు వద్దకు గౌతమ్ తన సైకిల్ పై వెళ్లాడు. ఎంతసేపయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు షాపు వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో బాధిత పేరెంట్స్ స్థానిక సూర్యాపేట టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story