- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగే నీళ్లనుకొని.. పురుగుల మందు తాగాడు
దిశ, దేవరకొండ: కుటంబం మొత్తం పొలం పనికి వెళ్లింది. మధ్యాహ్నం దాక పత్తి చేనుకు పురుగుల మందు కొట్టారు. అనంతరం భోజనానికి కూర్చున్నారు. తండ్రికి దప్పికకావడంతో నీళ్లను తీసుకురమ్మని కుమారుడికి చెప్పాడు. అయితే కుమారుడు తెలియక పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్ తెచ్చాడు. చివరికి తానే తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
కొండమల్లెపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన దాసరి కొండల్, విజయ దంపతులు తమ కుమారుడు శివతో కలిసి పొలానికి మందు కొట్టడానికి వెళ్లారు. మధ్యాహ్నం భోజన సమయంలో తండ్రి కొండల్ మంచి నీళ్లు తీసుకురమ్మని తన కొడుకు శివ చెప్పాడు. మంచినీళ్లు అనుకొని శివ పురుగుల మందు ఉన్న బాటిల్ తీసుకొచ్చాడు. చివరికి తానే తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో తండ్రి హుటాహుటిన శివను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.