ప్రియురాలి కుటుంబంపై కోపం.. దానిపై తీర్చుకున్నాడు

by  |
ప్రియురాలి కుటుంబంపై కోపం.. దానిపై తీర్చుకున్నాడు
X

దిశ, వెబ్‌డెస్క్ :

ప్రేమలో ఉన్నప్పుడు గొడవలు కామన్. ఇరు కుటుంబాల మధ్య కాస్ట్ లేదా కుటుంబ హోదా, డబ్బు మ్యాటర్ ప్రేమ వివాహానికి ఎప్పుడు అడ్డుపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కూతురు ప్రేమించిన వ్యక్తిని బంధువులు, ఇంటి పెద్దలు బెదిరించారు. దానిని మనసులో పెట్టుకున్న అతను ప్రియురాలి కుటుంబంపై ఉన్న కోపాన్ని ఆమె తండ్రి షాపు మీద తీశాడు. రాత్రిళ్లు ఎవరూ లేని సమయం చూసి నిప్పంటించాడు.ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. ముంబై, మానిక్‌పుర్‌కు చెందిన రాహుల్‌ పాశ్వాన్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల యువతితో ప్రేమలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు రాహుల్‌ను హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన అతను సెప్టెంబర్‌ 10న ప్రియురాలి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించాడు.

మొదట్లో దానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ అని అందరూ భావించారు. కానీ, సెప్టెంబర్‌ 21న యువతి తండ్రి తన షాపునకు దగ్గరలోని ఓ షాపులో సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. రాహుల్‌ షాపులోకి నిప్పును పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.



Next Story