ఆడుకుంటూ రూపాయి కాయిన్ మింగేసిన బాలుడు..

by Shyam |
ఆడుకుంటూ రూపాయి కాయిన్ మింగేసిన బాలుడు..
X

దిశ, నర్సంపేట : మూడేండ్ల బాలుడు అనుకోకుండా రూపాయి కాయిన్ మింగాడు. వెంటనే బాలుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా చాకచక్యంగా బయటకు తీశారు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన జంపాల వీరన్న కుమారుడు అజయ్‌కు మూడేళ్లు. గురువారం ఇంటి దగ్గర ఆట ఆడుకుంటూ అనుకోకుండా రూపాయి కాయిన్ మింగాడు.

ఆ తర్వాత ఆహారం తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. కంగారు పడిన అజయ్ తల్లిదండ్రులు నర్సంపేటలోని త్రినాధ్ ఈఎన్టీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. పరిస్థితిని గమనించిన డాక్టర్ త్రినాధ్ ఎంతో చాకచక్యంగా బాలుడి మింగిన రూపాయి బిళ్ళను బయటికి తీశాడు. అప్పటివరకు తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు కాయిన్ బయటికు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. వ్యయప్రయసాలకు ఓర్చి కాయిన్ బయటకు తీసిన డాక్టర్ త్రినాధ్ కు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed