ఈత కెళ్లి తిరిగిరాని బాలుడు..

by Sridhar Babu |
ఈత కెళ్లి తిరిగిరాని బాలుడు..
X

దిశ, మానకొండూరు : ఈత కెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకివెళితే.. మంద అభిచరణ్ (11) చెరువులో ఈత నేర్చుకోవడానికని వెళ్లి తిరిగిరాలేదు. సోదరుడితో కలిసి నీటిలో దిగిన బాలుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.

అతన్ని కాపాడేందుకు యత్నించాలనుకున్న సోదరుడికి కూడా ఈత రాకపోవడంతో అతన్ని కాపాడలేక పోయారు. స్థానిక సీఐ సంతోష్ కుమార్ కథనం ప్రకారం.. చిన్న పిల్లలు ఎవరూ కూడా చెరువుల్లో ఈత నేర్చుకోవడానికి వెళ్లవద్దని.. తల్లిదండ్రులు పంపవద్దని సూచించారు.

Next Story

Most Viewed