- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాజ్యసభకు బూర?
దిశ, నల్లగొండ:
తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు. ఖాళీ అయిన ఆ రెండు స్థానాలూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఏప్రిల్ 9న ఈ సీట్లు ఖాళీ అవుతాయి. అయితే, ఒక రాజ్యసభ స్థానానికి భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బూర నర్సయ్యగౌడ్‌కు పార్టీలో మంచి పేరు ఉండటం, విభేదాలకు, గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉండటం కలిసొచ్చే అంశాలని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీసీ సామాజికవర్గం నుంచి వచ్చిన బూర నర్సయ్య గౌడ్‌ను రాజ్యసభ సభ్యునిగా పంపడం ద్వారా సముచిత స్థానం కల్పించినట్టు అవుతుందని అధిష్టానం భావిస్తున్నదని సమాచారం. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె.కేశవరావు ఈసారి తెలంగాణ నుంచి తనకు రాజ్యసభ ప్రాతినిధ్యం కావాలని కోరుతున్నారని తెలుస్తోంది.
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నిబంధనలో భాగంగా సభ్యుల పదవీకాలం పూర్తి కావడానికి 50 రోజుల ముందే ఎన్నికల పక్రియ ప్రారంభించాల్సి ఉండటంతో అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని అంచనా. కాగా ప్రస్తుతం రాజ్యసభకు తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు ఉండగా టీఆర్ఎస్‌కు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. 119 మంది శాసన సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఖాళీ కానున్న రెండు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్ఐఎంకు 7, కాంగ్రెస్‌కు 6, టీడీపీ, బీజేపీకి ఒక్కో శాసనసభ్యులు ఉన్న విషయం తెలిసిందే.
Read also..