ఓన్ ఓటీటీ లాంచ్ చేసిన ‘బుక్ మై షో’

by Anukaran |   ( Updated:2021-02-07 09:10:16.0  )
ఓన్ ఓటీటీ లాంచ్ చేసిన ‘బుక్ మై షో’
X

దిశ, సినిమా : పాపులర్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’.. ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు పోటీగా ఓన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ‘బుక్ మై షో స్ట్రీమ్‌’ పేరుతో లాంచ్ అయిన ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా సినిమాలు, 72 వేల గంటలకు పైగా కంటెంట్, 22 వేల గంటలకు పైగా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందుబాటులో ఉంది.

ఓటీటీ స్పేస్ ఎకానమిక్ మార్కెట్‌లో గట్టి పోటీదారుడిగా వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. సబ్‌స్క్రైబర్ బేస్‌లో కాకుండా ‘ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్’ మోడల్‌లో సేవలు అందించనుంది. అంటే ‘పే-పర్-వ్యూ’ మోడల్‌లో వర్క్ చేయనున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం ఒక సినిమాను కొనొచ్చు లేదా కొంత కాలం వరకు రెంట్‌కు తీసుకోవచ్చు. ఈ రెంట్ పీరియడ్‌లో మూవీ ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా చూడొచ్చు. ఆల్రెడీ థియేటర్‌లో రిలీజై బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలే ఈ డిజిటల్ స్పేస్‌లో అందుబాటులో ఉండటం మరో యూనిక్ ఫ్యాక్టర్.

కాగా ‘బుక్ మై షో స్ట్రీమ్‌’లో ఉన్న ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌లో క్రిస్టోఫర్ నోలన్ ‘టెనెట్’, గల్ గాడోట్ ‘వండర్ ఉమెన్ 1984’, హారర్ ఫాంటసీ ‘ ది క్రాఫ్ట్ : లెగసీ’ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కాగా ‘ది పీనట్ బట్టర్ ఫాల్కన్, ది గిల్టి, అన్ హింజ్డ్, లెస్ మిజరబుల్స్, కోమా, ఎస్ అండ్ ఎస్’ త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Next Story