టీడీపీ మహిళా నేతలకు షాక్.. వారందరిపై కేసులు నమోదు

by srinivas |
priyanka
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనంతపురం పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు వాల్మీకి ప్రియాంకతోపాటు పలువురు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఫోర్త్‌ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దీంతో టీడీపీ మహిళా నాయకురాలు వాల్మీకి ప్రియాంకతో పాటు మిగిలిన మహిళా నేతలను పోలీసులు విచారిస్తున్నారు.

అయితే ఈ కేసులపై టీడీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబాన్ని అవమానించేలా నిండు అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని సలహా ఇచ్చారు. అంతేకానీ తమపై కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి వేధించినా వెనుకాడేదిలేదని వాల్మీకి ప్రియాంక తెగేసి చెప్పారు. మరోవైపు ఇటీవలే వాల్మీకి ప్రియాంక మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబులపై కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని, అంబటి రాంబాబులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈనెల 21 కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే టీడీపీ మహిళా నేతలపై కేసులు నమోదు చేయడాన్ని జిల్లా టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా నేతలపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed