- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికుల నిధుల్లో భారీగా గోల్ మాల్ : బోండా ఉమా
దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధుల నుంచి కోట్లాది రూపాయలు గోల్‌మాల్ చేశారని ఆరోపించారు. 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఏపీ ప్రభుత్వం నయవంచనకు గురి చేసిందని ధ్వజమెత్తారు. కార్మికుల సంక్షేమ నిధి నుంచి కోట్లాది రూపాయలను జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కార్మికులకు టీడీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల నిధుల గోల్‌మాల్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటే కార్మికులకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని బోండా డిమాండ్ చేశారు.