వరవరరావు కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

by Shamantha N |
వరవరరావు కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
X

ముంబయి: విరసం సభ్యుడు వరవరరావు, నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 15 రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవడానికి అనుమతినిస్తూ ఆస్పత్రి నిబంధనలకు అనుగుణంగా కుటుంబీకులూ ఆయనను కలవవచ్చునని తెలిపింది. చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయన ఉన్న తలోజా జైలు నుంచి విడుదల చేయాలని, 2018 నుంచి వీవీకి సరైన వైద్యం అందించడంలేదని సహచరి పీ హేమలత హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

వీవీకి కరోనా పాజిటివ్ తేలిన తర్వాత చికిత్సనందించిన నానావతి హాస్పిటల్‌కు అతన్ని తరలించి చికిత్స అందించాలని అభ్యర్థించారు. ‘వరవరరావుకు జ్ఞాపకశక్తి మందగించింది. మూత్రనాళాల రుగ్మత హెచ్చింది. ఆ జైలు నుంచి తరలించకుంటే ప్రాణాలు కోల్పోతారు. అదే జరిగితే కస్టోడియల్ డెత్‌‌గానే పరిగణించాల్సి ఉంటుంది’ అని హేమలత తరఫు న్యాయవాది, సీనియర్ కౌన్సెల్ ఇందిరా జైసింగ్ వాదించారు. వీవీ ఆరోగ్యం బాగాలేదని, కానీ, వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed