ప్రమాణస్వీకారం రోజే బాంబు పేలుళ్లు..

by  |
ప్రమాణస్వీకారం రోజే బాంబు పేలుళ్లు..
X

అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే బాంబులు పేలడంతో ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా భయంతో పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే పేలుళ్లు జరుగుతున్నా అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ప్రజల సమక్షంలో ధైర్యంగా ప్రమాణం చేశారు. పేలుళ్లకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదని ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది.

Taga: afaganistn govt, president swearing ceremony, ashraf gani, bomb blast


Next Story

Most Viewed