సుశాంత్ కుటుంబం న్యాయపోరాటం

by  |
సుశాంత్ కుటుంబం న్యాయపోరాటం
X

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన జరిగి రెండు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ తన మరణంపై ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య కాదు హత్యే అని అభిమానులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం విచారణ పేరుతో కాలయాపన చేస్తూ 60 రోజులు గడిచినా అసలు ఏం జరిగిందో చెప్పలేకపోయారు. గంటకో ట్విస్ట్, నిమిషానికో షాకింగ్ న్యూస్ బయటపడుతున్న ఈ కేసులో అసలు నిజం ఏంటో తెలుసుకునేందుకు రెండు నెలలుగా ప్రతిక్షణం ఎదురుచూస్తూనే ఉన్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న వారు.. ఎన్నో కలలు కన్న సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరేది కేవలం అసలు నిజం బయటపడినప్పుడే అంటూ పోరాటాన్ని సాగిస్తున్నారు. ఎన్నో కలలు కన్న సుశాంత్ ఆత్మ హత్య చేసుకునే పిరికి వాడు కాదని దీని వెనుక ఏదో కుట్ర ఉందని న్యాయపోరాటం చేస్తున్నారు.

ఇప్పటికే సుశాంత్ లవర్ రియా సింగ్ అండ్ ఫ్యామిలీపై కేసు పెట్టిన కుటుంబం..సుశాంత్ కోసం ఉద్యమం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేత సింగ్ కుటుంబం చేస్తున్న పోరాటంలో విశ్వవ్యాప్తంగా సపోర్ట్ కావాలని కోరింది. అప్పుడే నిజం బయటపడి సుశాంత్‌కు న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేసింది. ఆగస్ట్ 15న జరిగే గ్లోబల్ ప్రేయర్స్‌లో పాల్గొని.. సీబీఐ విచారణకు మద్దతు తెలపాలని కోరింది.# GlobalPrayersforSSR పేరుతో సోషల్ మీడియాలో తమ తమ సంతాపం తెలపాలని కోరిన శ్వేత… న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

https://www.instagram.com/p/CD0LlXtF0_J/?igshid=10wdtcomvqqkn

కాగా, #CBIforSSR పేరుతో జరుగుతున్న ట్రెండ్‌కు భారీ మద్దతు లభిస్తున్నది. సుశాంత్ కేసులో సీబీఐ విచారణ జరగాలని..తన మరణం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సుశాంత్ సోదరి చేస్తున్న పోరాటానికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే వరుణ్ ధావన్, కంగనా రనౌత్, పరిణీతి చోప్రా, సూరజ్ పంచోలి, అంకిత‌లోఖండే, సంజనా సంఘీ‌తోపాటు పలువురు నటీనటులు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇక ఈ కేసు విషయంలో స్పందించింది నిర్భయ తల్లి ఆశాదేవి. సుశాంత్ కుటుంబం న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం చేయాలని కోరింది. ముంబై పోలీసు ఆ కుటుంబానికి సపోర్ట్‌గా ఉండాలని అభిప్రాయ‌పడింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హీరోయిన్ జియా ఖాన్ తల్లి రబ్యా ఖాన్ కూడా సుశాంత్ కుటుంబానికి మద్దతు తెలిపింది. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పకుండా జరగాలని డిమాండ్ చేసింది. తన కూతురి సూసైడ్, సుశాంత్ ఆత్మహత్య కేసుల్లో బాలీవుడ్ మాఫియా, రాజకీయ నాయకులకు కనెక్షన్ ఉందని ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని లేదంటే మరింత మందిని ఇలాగే బలితీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

https://www.instagram.com/p/CD2aH5flLz9/?igshid=v3xrfowq8i8h


Next Story