ఆ స్టార్ హీరోయిన్లను.. విచారించనున్న పోలీసులు

by Anukaran |   ( Updated:2020-07-22 10:14:17.0  )
ఆ స్టార్ హీరోయిన్లను.. విచారించనున్న పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లయిన ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనేలను ముంబై పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ఫాలోవర్స్‌తో పాటు, నకిలీ ఫాలోవర్స్‌కు సంబంధించిన విషయంలో ఎనిమిది మంది సెలబ్రీల వివరాలు ముంబై పోలీసులు సేకరించగా, అందులో ఈ స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. రోజురోజుకూ సోషల్ మీడియా విస్తరిస్తుండటంతో ఫేక్ అకౌంట్లు పెట్టి సెలబ్రెటీలను రోడ్డున పడేసే చర్యలు అనేకం జరుగుతున్నాయి. అయతే ఇప్పటికే ఈ నకిలీ సోషల్ మీడియా ఫాలోవర్స్‌‌కు సంబంధించి 54 సంస్థల ప్రమేయమున్నట్టు పోలీసుల స్పష్టం అయ్యింది. అందులో భాగంగా ముంబై పోలీసులు దీపికా, ప్రియాంక చోప్రాను త్వరలో పిలిచి వారి సోషల్ మీడియా అకౌంట్స్‌తో పాటు ఫాలోవర్స్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు విచారించనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణేలు వరుసగా మొదటి రెండో స్థానంలో ఉన్నారు. ప్రియాంక చోప్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 54.6 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు. దీపికా పదుకొనే 50 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Next Story