ప్రధానమంత్రిగా మారిన స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్

by Shyam |   ( Updated:2021-08-05 01:03:37.0  )
ప్రధానమంత్రిగా మారిన స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి లారాదత్తా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలో ఉన్న ఆమెను చూస్తే లారానా..? అని అనుమానమొస్తుంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బెల్ బాటమ్’ చిత్రంలో లారా దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన హైజాక్‌ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌ ట్రైలర్ ఇటీవలే విడుదలవ్వగా.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించిన లారా లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

అచ్చు గుద్దినట్లు ఇందిరా గాంధీని గుర్తుచేసినట్లు ఉన్న ఆమె లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక పాత్ర కోసం లారా దత్తా పడ్డ కష్టం చూసి ట్రైలర్ చూసినవారందరూ నోరెళ్లబెడుతున్నారు. ఒక మనిషిని మేకప్ ఇంతలా మార్చేయగలదా అంటే అస్సలు నమ్మలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఆగస్టు 19 న విడుదలకి సిద్ధం అవుతోంది.

Advertisement

Next Story