- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు కరోనా.. పార్టీ చేసుకుంటుందని పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” గత కొన్ని రోజుల నుంచి నా శరీరం చాలా బలహీనంగా, కళ్లు కూడా మండుతున్నట్లు అనిపించింది. హిమాచల్ కి వెళదామని నిన్న కరోనా టెస్ట్ చేయించుకున్నాను.. ఈరోజు ఫలితాల్లో పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే క్వారంటైన్ అయిపోయాను. కరోనా వైరస్ నా శరీంలో పార్టీ చేసుకుంటున్నదే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడే తెలిసింది.. ఇక దాని అంతు చూస్తా.. మీరు కూడా ఈ వైరస్ కి భయపడకండి. భయపడితే అది మిమ్మల్ని ఇంకా భయపెడుతుంది. ఈ వైరస్ జస్ట్ చిన్న ఫ్లూ లాంటిదే.. అదే వస్తుంది.. అదే తగ్గిపోతుంది. హరహర మహాదేవ్” అంటూ పోస్ట్ పెట్టింది. ఇక కంగనాకు కరోనా అని తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.