హాస్పిటల్ లో చేరిన అక్షయ్ కుమార్… టెన్షన్ లో అభిమానులు

by Anukaran |   ( Updated:2021-04-04 23:48:50.0  )
హాస్పిటల్ లో చేరిన అక్షయ్ కుమార్… టెన్షన్ లో అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించడంతో ఆయన హోమ్ క్వారెంటైన్ కి వెళ్లిపోయారు. అయితే సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరినట్లు అక్షయ్ ట్వీట్ చేసారు. దీంతో అభిమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, కేవలం వైద్యుల సూచన మేరకే ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు అక్షయ్ తెలిపారు. అభిమానులు ఎవరు కంగారు పడవద్దని కోరారు. ఇకపోతే ప్రస్తుతం అక్షయ్ ‘రామ్ సేతు’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర యూనిట్ లో 45 మందికి కరోనా సోకినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అక్షయ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Advertisement

Next Story