హ్యాపీ బర్త్ డే ‘కిలాడీ’

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ఇవాళ 53వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. బీ టౌన్‌లో ‘ఖాన్’ల హవా ఎక్కువగా నడుస్తున్న సమయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అక్షయ్. బాలీవుడ్‌లో ఆయన్ను ‘కిలాడీ’ అని ఎక్కువగా సంభోదిస్తుంటారు. కారణం ఆయన కథానాయకుడిగా నటించిన ‘కిలాడీ’ మూవీ ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది.

స్టంట్ మెన్‌గా కెరీర్ ప్రారంభించిన అక్షయ్ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ‘సౌగంధ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ 29ఏళ్ల కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ఎన్నో రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 2009లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో ఆయన్ను సత్కరించగా.. ‘రుస్తుం’ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నారు.

అక్షయ్ కుమార్‌లో మరో కోణం ఉంది. ప్రతిఏటా ఇండియన్ ఆర్మీకి రూ. కోట్లలో ఫండ్ ఇస్తుంటారు. అటు కరోనా విపత్కర సమయంలోనూ రూ.25 కోట్లు సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు ఈ కిలాడీ. అయితే, అక్షయ్ ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అతని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కోరారు.

Advertisement