- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ రాగానే చంద్రబాబును కలుస్తా : సోనూసూద్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సభకు, రాజకీయాలకు సంబంధంలేని నారా భువనేశ్వరిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలపై చంద్రబాబు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందిస్తూ.. చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ హీరో సోనూసూద్ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు సమాచారం. దేవాలయం లాంటి శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని సోనూసూద్ వ్యాఖ్యానించాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యపై వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చంద్రబాబుకు సోనూసూద్ చెప్పినట్లు తెలుస్తోంది.
Next Story