మాఫియా నుంచి మహేశ్‌కు బెదిరింపు కాల్స్

by Anukaran |   ( Updated:2020-08-27 05:19:11.0  )
మాఫియా నుంచి మహేశ్‌కు బెదిరింపు కాల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు గోపీచంద్ హీరోగా నటించిన ఒక్కడున్నాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్‌కు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రముఖ అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం పేరుతో ఆయన కొంతమంది ఫోన్‌లు చేసి రూ.35 కోట్లు ఇవ్వాలని బెరింపులకు పాల్పడ్డారు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన ముంబై పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story