- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బొలెరో బోల్తా.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రాంపురం వద్ద బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాళ్లోకి వెళితే.. చంద్రుగొండ మండలానికి చెందిన వీరంతా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో జరుగుతున్న శుభకార్యానికి బోలెరో వాహనంలో బయల్దేరారు.
ఈ క్రమంలో రాంపురం గ్రామానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న టాటాఎస్ వాహనాన్ని తప్పించబోయి రోడ్డు వంపులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో లక్ష్మీ(40) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story