శివాలయం బావిలో వేడి చేసిన నీళ్లు

by Shyam |   ( Updated:2021-11-29 06:14:16.0  )
Shivalayam
X

దిశ,వెబ్ డెస్క్: కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతనమైన శివాలయంలో వేడినీళ్లు వస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మామాలుగా అయితే బావి నీళ్లు చల్లగా ఉంటాయి. కాని ఈ శివాలయంలో నీళ్లు వేడిగా రావడం వలన ఓ వింత చోటుచేసుకుంది. ఈ విషయం చుట్టూ పక్కల వారికి తెలియడంతో అక్కడ ప్రజలు చూడాటానికి ఎగబడుతున్నారు. ఇది ఆ శివుడు చేసే అద్బుతం అని ప్రజలు నమ్ముతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆలయంలో పనిచేసే సుగుణ అనే మహిళ ఉదయాన్నే బావిలో నీళ్లు తోడగా వేడిగా వచ్చాయి. అలా నీళ్లు రోజు వేడిగా రావడంతో ఆ నోటా ఈ నోటా అందిరికి తెలిసింది.దీనిని చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. గత నాలుగు నెలల నుండి ఈవిధంగా నీళ్లు వస్తున్నాయని అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.

దీనిపై కొందరు భౌతిక శాస్త్ర నిపుణులు వివరణ ఇస్తున్నారు. సాధారణంగా బావిలో నీరు 25-30 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుందన్నారు. అలాగే ఈ బావిలో మాత్రం కాస్త ఎక్కువగా 40-45 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉందని చెబుతున్నారు. బావిలోపల సున్నపు రాతి పొరలున్నప్పుడు వేడినీటి ఊటలు ఏర్పడుతాయని, దాని కారణంగానే వేడినీళ్లు రావడం జరుగుతుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story