కండల వీరులతో ఫుడ్ డెలివరీ

by  |
కండల వీరులతో ఫుడ్ డెలివరీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా బిజినెస్‌లన్నీ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్‌ల బిజినెస్‌లు దారుణంగా పడిపోయాయి. కరోనా వ్యాపిస్తుందన్న కారణంతో డెలివరీ బాయ్‌లను కూడా జనాలు నమ్మడం లేదు. అందుకే జపాన్‌కు చెందిన ఒక రెస్టారెంట్ యజమాని వినూత్నంగా ప్రయత్నించాడు. స్వతహాగా బాడీ బిల్డర్ అయిన 41 ఏళ్ల మేసనోరి సిగ్యురా అనే రెస్టారెంట్ యజమాని కండల వీరులతో ఫుడ్ డెలివరీ ప్రారంభించాడు. అంతే.. ఈయన నడిపే సూషీ రెస్టారెంట్‌కు ఆర్డర్‌లు వెల్లువలా పెరిగిపోయాయి. ఇంతకీ ఈయన కండల వీరులతో చేసిన ఆ వినూత్న ఫుడ్ డెలివరీ ఏంటంటే?

వీరి రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టినపుడు, ఒక సూట్ వేసుకున్న బాడీ బిల్డర్ మీ ఆర్డర్ పట్టుకుని ఇంటి దగ్గరికి వస్తాడు. సామాజిక దూరం పాటిస్తూ మీ ఆర్డర్‌ను మీకు అందిస్తాడు. ఇందులో కొత్తేముంది అంటారా? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఆ డెలివరీ బాయ్ అతని షర్ట్ విప్పేసి, అతని కండలను చూపిస్తూ ప్రదర్శన చేస్తాడు. మీతో సెల్ఫీ దిగుతాడు. ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో నిల్చుని ఫొటోలకు పోజులిస్తాడు. ‘డెలివరీ మాచో’ అని పిలిచే ఈ డెలివరీ బాయ్‌లకు ఇప్పుడు చాలా పేరొచ్చింది. అయితే, ఇలా బాడీ బిల్డింగ్ చేసిన డెలివరీ బాయ్ ఇంటికి రావాలంటే మాత్రం గరిష్ట ఆర్డర్ పెట్టాల్సిందే. 7000 యెన్‌లు అంటే రూ. 4825లతో ఆర్డర్ ఇచ్చినపుడే ఈ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మేసనోరి సిగ్యురా రెస్టారెంట్‌కు రోజుకు 10 వరకు ఇలాంటి ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో తాను కరోనా లాక్‌డౌన్ వల్ల కోల్పోయిన మొత్తాన్ని రాబట్టుకుంటున్నట్లు మేసనోరి తెలిపారు.


Next Story

Most Viewed