ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ విభజన వాయిదా

by Harish |
ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ విభజన వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఈ నెల ప్రారంభంలో స్టాక్ విభజనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి పరిణామాల కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున స్టాక్ విభజన ప్రతిపాదనపై నిర్ణయాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా స్టాక్ విభజన ప్రతిపాదనపై లాభ నష్టాల గురించి డైరెక్టర్ల బోర్డు విస్తృతమైన చర్చను నిర్వహించింది. గత నెలల్లో షేర్ల కదలికలు, ఆర్థిక ప్రామాణికతను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ విభజన నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ఎక్స్ఛేంజీ ముందు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ వివరించింది. కొవిడ్-19 సంక్షోభం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అనిశ్చితిలో పడేసింది, ఆ అంశాన్ని ముత్తూట్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డు పరిగణలోకి తీసుకుందని, స్టాక్ విభజన ప్రతిపాదనపై చర్చల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story