- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BMW నుంచి 25 న్యూ వెర్షన్ కార్లు
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ 2021లో దేశీయంగా 25 కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపింది. గురువారం బీఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ మోడల్‌ను విడుదల చేసిన కంపెనీ, వ్యక్తిగత వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌లో రెండంకెల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. ‘కరోనా వల్ల కంపెనీ గతేడాది దారుణ పరిస్థితులను ఎదుర్కొందని, అందుకే కంపెనీ కార్యకలాపాలను మూసివేయాల్సి వచ్చింది. అయితే, గత ఎనిమిది నెలల నష్టాలను అధిగమించే స్థాయిలో ఈ ఏడాది పూర్తిగా 12 నెలలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆశిస్తున్నాం.
ఇటీవల పరిణామాల్లో డిమాండ్ సైతం పెరుగుతోందని’ బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా చెప్పారు. గతేడాది నవంబర్-డిసెంబర్‌లలో కంపెనీ తన కరోనా పూర్వస్థాయిలో అమ్మకాలను సాధించింది. ఈ ఏడాది కంపెనీ వృద్ధి మరింత బలంగా ఉంటుందని, రెండంకెల స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి తర్వాత ఆరోగ్యం, భద్రతా సమస్యల కారణంగా వ్యక్తిగత వినియోగం పెరగడం, అంతర్జాతీయ ప్రయాణాలను రద్దు చేసుకున్న వినియోగదారులు లగ్జరీ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు అంశాలు డిమాండ్ పెంచేవిగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది 25 కొత్త మోడల్ కార్లను తీసుకురావాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు విక్ర్ వెల్లడించారు.