ఫాలో కొవిడ్ రూల్స్.. మేము మళ్లీ వెనక్కి వెళ్లాలనుకోవట్లేదు : బీఎంసీ

by Shamantha N |
ఫాలో కొవిడ్ రూల్స్.. మేము మళ్లీ వెనక్కి వెళ్లాలనుకోవట్లేదు : బీఎంసీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభణ నెమ్మదిగా తీవ్ర స్థాయికి చేరుతోంది. యూకే వేరియంట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో వైరస్ తీవ్రతను గుర్తించిన కేంద్రం, రాష్ట్రాలను వెంటనే అప్రమత్తం చేసింది. గతేదాది డిసెంబర్‌లో నమోదైన కేసుల కంటే తాజాగా దేశవ్యాప్తంగా కరోనా రికార్డ్ అయిన కేసుల సంఖ్య అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో అధికంగా మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి.

ముఖ్యంగా ముంబై సిటీలో కరోనా కేసులు విలయతాండటం చేస్తున్నాయి. బుధవారం 5,185 కేసులు నమోదవడంతో బృహన్ ముంబై కార్పొరేషన్ గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. భారీ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ కొవిడ్ రూల్స్‌ను పాటించాలని కోరింది. గతంలో లాగా ఈసారి కూడా కేసుల సంఖ్య పెరగాలని తాము భావించడం లేదని.. ‘‘మళ్లీ వెనక్కి వెళ్లి తమ వాళ్లను(కరోనా వారియర్ల)ను కోల్పోయేందుకు సిద్ధంగా లేమని’’ ట్వీట్ చేసింది. ఇదిలాఉండగా, జనవరి -2021లో బీఎంసీ పరిధిలో 236గా కరోనా కేసుల సంఖ్య రెండు నెలల వ్యవధిలోనే 5వేల మార్క్‌ను దాటింది.

Advertisement

Next Story