‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఆలియాపై కేసు?

by Shyam |
alia bhaat
X

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ ఆలియా భట్ తాజాగా గవర్నమెంట్ రూల్స్ బ్రేక్ చేసి పెద్ద సమస్యలో ఇరుక్కుంది. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఆలియా తన అప్‌కమింగ్ మూవీ ‘బ్రహ్మస్త్ర’ మోషన్ పోస్టర్ లాంచింగ్‌కు రణ్‌బీర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లింది. అక్కడ కొవిడ్ ప్రికాషన్స్ పాటించకుండా అభిమానులు, సెలబ్రిటీలను కలవడం సమస్యకు దారితీసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ.. కొవిడ్ నిబంధనలు పాటించని ఆలియాపై పాండమిక్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బీఎంసీ పబ్లిక్ హెల్త్ కమిటీ ఆఫీసర్.. ‘ఆలియా కొవిడ్ రూల్స్‌ బ్రేక్ చేసింది. అందుకే తన మీద కేసు నమోదు చేయాలని బీఎంసీ ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేశాను. ఎంతోమందికి రోల్ మోడల్ అయిన ఆమె చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వం విధించిన రూల్స్ అందరికీ సమానంగా వర్తిస్తాయి’ అంటూ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed