- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. చంద్రబాబు పర్యటనకు ముందు భారీ బ్లాస్ట్.. ప్లాన్ చేశారా.?
దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో భారీ పేలుడు ఘటన సంభవించింది. కొవ్వూరులోని మైధిలీ హల్ ప్రాంతంలోని ఒక గదిలో రాత్రి భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ఘటనా స్థలంలో భారీ గుంత పడింది. భారీ శబ్దం విన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. బ్లా్స్ట్ కారణంగా విద్యుత్ స్తంభం నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, శ్మశానవాటిక సమీపంలో నిల్వఉంచిన నల్ల మందు పేలిందా, లేక బాంబులు పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నెల్లూరు చేరుకుని ఇందుకూరుపేట, కోవూరు, నెల్లూరు సిటీ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ, గాంధీ గిరిజన కాలనీ, జనార్ధనరెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. ఈ పరిస్థితుల్లో భారీ పేలుడు ఘటన పలు అనుమానాలకు దారి తీస్తున్నది. పేలుడు సమచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేస్తున్నారు.