కేరళ బ్లాస్టర్స్ తొలి విజయం

by Shyam |
కేరళ బ్లాస్టర్స్ తొలి విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్ తొలి విజయం సాధించింది. ఆదివారం రాత్రి జీఎంసీ స్టేడింయలో హైదరాబాద్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 2-0 తేడాతో విజయం సాధించింది. టాస్ గెల్చిన కేరళ జట్టు కుడి నుంచి ఎడమకు ఆడటానికి నిర్ణయించకుంది. 8వ నిమిషంలో హైదరాబాద్‌కు కార్నర్ లభించినా కేరళ డిఫెండర్స్ సమర్దవంతంగా అడ్డుకున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి బంతి హైదరాబాద్ ఎఫ్‌సీ నియంత్రణలోనే ఉన్నది.

అయితే హైదరాబాద్ డిఫెండర్ల వ్యూహాన్ని కేరళ మిడ్ ఫీల్డర్ పీరయ్య ఛేదించాడు. ఆ బంతిని స్ట్రైకర్ అబ్దుల్ హక్‌కు అదించడంతో అతను నేరుగా గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో తొలి అరగంటలోనే కేరళకు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తొలి అర్దభాగంలో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఇక రెండో అర్దభాగంలో కూడా ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. 58వ నిమిషంలో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ కొట్టిన బంతి గోల్‌పోస్టులోకి పోలేదు. దీంతో కేరళ తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది.

ఆట ముగుస్తుంది అనగా 88వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్ ఆటగాడు జోర్డన్ అద్భుతమైన గోల్ కొట్టాడు. దీంతో కేరళ ఆధిక్యం 2-0కి పెరిగింది. చివరి రెండు నిమిషాల్లో హైదరాబాద్ ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో కేరళ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. కేరళ ఆటగాడు పీరయ్య డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, జీక్సన్ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.

Advertisement

Next Story