ఇదేం వింత.. నల్లని రంగులో వరి పొలం (వీడియో)

by Anukaran |   ( Updated:2023-08-18 15:42:37.0  )
ఇదేం వింత.. నల్లని రంగులో వరి పొలం (వీడియో)
X

దిశ, ఆర్మూర్ : వరి చేను అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పచ్చదనం. అందుకే ఓ సినీ కవి సైతం పచ్చని పంటచేలను వర్ణిస్తూ ‘భూమికి పచ్చాని రంగేసినట్టో’.. అన్న పల్లవితో తన పాట మొదలెట్టారు. అయితే ఇకపై ఎవరైనా పొలంగట్ల అందాన్ని అభివర్ణిస్తూ ‘భూమికి నల్లాని రంగేసినట్టు’.. అని రాసినా తప్పు పట్టాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తున్నది.

ఎందుకంటే, మాక్లూర్ మండలం శాంతినగర్ గ్రామ సమీపంలోని ఓ వరిచేనును చూసినప్పుడు ఔను, ఇది నిజమే కాబోలు.. ‘శ్రీరాములయ్య’ పాట వరుస మారుతుందేమోననిపిస్తున్నది! ఆ గ్రామానికి చెందిన రైతు దేవభక్తుని జగన్మోహన్ రావు తన పొలంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వేసిన దేశవాళీ రకం సీడ్ ‘కాలా బట్టి’ వరి పైరు నల్లగా నిగనిగలాడుతూ అందరి మనసూ దోచేస్తోంది. ఆ ‘చిత్రమే’ ఇలా ‘దిశ’ విలేకరి కంట పడింది.

Advertisement

Next Story