మజీద్ నిర్మాణం నిలిపివేయండి.. ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవైయం ధర్నా

by Shyam |
మజీద్ నిర్మాణం నిలిపివేయండి.. ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవైయం ధర్నా
X

దిశ, బోధన్ : బోధన్ మండలంలోని పెంటాఖుర్ద్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ ప్రహరీ గోడని ఆనుకోని.. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మజీద్ నిర్మాణాన్ని నిలిపివేయాలని బీజేవైయం నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం బీజేవైయం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైయం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందన్నారు.

అంతే కాక విద్యాలయాలకు దగ్గరలో ప్రార్థన మందిరాల నిర్మాణాలు చేయకూడదనే జీవోను కూడా లెక్కచేయకుండా స్థానిక మైనారిటీ ఎమ్మెల్యే అండదండలతో పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకోని మజీద్ నిర్మాణాన్ని కొనసాగించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ఈ పాఠశాలలో చదివే పిల్లల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్రమ మజీద్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

లేని క్రమంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోలిపాక బాలరాజు, మండల అధ్యక్షులు మోస్రా పోశెట్టి, కార్యదర్శి వాసు, బీజేపీ కౌన్సిలర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed