- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబ్బాకలో బీజేపీదే విజయం
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్ : దుబ్బాకలో బీజేపీ విజయ కేతనం ఎగర వేసింది. మొదటి నుంచి ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు కమలం వికసించింది. 12 రౌండ్ల వరకు బీజేపీ లీడ్ లో ఉండగా.. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆధిక్యం చూపించింది. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత 20వ రౌండ్ నుంచి బీజేపీ మళ్లీ పుంజుకోని స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. చివరి రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, 23 రౌండ్లు పూర్తయ్యే సరికి 1,470 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా, ఇందులో 353 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లను మైనస్ చేశారు. దీంతో ఓవరాల్‌గా 1,118ఓట్ల మెజార్టీతో బీజేపీ విజయఢంకా మోగించింది. కాగా, చివరి రెండు రౌండ్లు ఉండగానే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
మొత్తం ఓటర్లు – 1,98,807
పోలైన ఓట్లు – 1,64,192
లెక్కించిన ఓట్లు : 1,62,516
మిగిలినవి ఈవీఎంలలో ఉండిపోయాయి.
23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత పార్టీల బలాబలాలు :
టీఆర్ఎస్ – 61,302
బీజేపీ – 62,772
కాంగ్రెస్ – 21,819
నోటా -552
మెజారిటీ ఓట్లు 1,118 (బీజేపీ) (పోస్టల్ బ్యాలెట్లలో తేడాను తీసేయగా)