- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెత్తురు చిందించిన TRS-BJP కార్యకర్తలు
X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బై ఎలక్షన్స్ ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక మైకులు మూగబోయిన తర్వాత కూడా మరోసారి అలజడి రేగింది. సిద్ధిపేటలోని స్వర్ణప్యాలెస్‌లో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు గొడవపడ్డారు. ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో టీఆర్ఎస్ నాయకులు బస చేస్తున్న సమయంలో తనిఖీల కోసం బీజేపీ కార్యకర్తలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట కాస్తా కొట్లాటకు దారి తీసింది. ఈ సమయంలో ఒకరికి గాయాలై.. రక్తం చిందింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో గొడవ జరగడంతో రాజకీయంగా దుమారం రేగింది.
Advertisement
Next Story