బండి ప్రకటనలో మహిళలకు ప్రాధాన్యం

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. మొత్తం 23 మంది రాష్ట్ర కమిటీని శనివారం బండి సంజయ్ ప్రకటించారు. అందులో 8 మందిని ఉపాధ్యక్షులుగా, నలుగురు ప్రధాన కార్యదర్శులుగా, 8 మంది కార్యదర్శులుగా ఉన్నారు. యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులుగా నియామకమయ్యారు.

ఆరుగురు మహిళలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. ప్రధాన కార్యదర్శులుగా ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ రావు, బంగారు శృతి, మంత్రి శ్రీనివాస్ నియామకమయ్యారు. అధికార ప్రతినిధులుగా కృష్ణ సాగర్, రజనీకుమారి, రాకేష్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా గీతామూర్తి, యువ మోర్చా అధ్యక్షుడిగా భాను ప్రకాశ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి నియామకమయ్యారు.

Advertisement