- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునిగిపోయే స్థలాలు కేటాయించారు : వీర్రాజు
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా కాలువలు, చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. దీంతో వరదలు విపరీతంగా పెరిగి ఇండ్లలోకి చేరి, ఇళ్లు మునిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం స్పందించి, బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పందించారు. వరద నీటిలో మునిగిపోయే స్థలాలను కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ వర్షం వస్తే ఈ 30 వేల మందికి పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ భూములకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని వీర్రాజు ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించకపోగా, అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరును కొనసాగిస్తే… ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.