సీపీని సస్పెండ్ చేయాలని బండి సంజయ్ దీక్ష

by Shyam |   ( Updated:2020-10-26 22:33:42.0  )
సీపీని సస్పెండ్ చేయాలని బండి సంజయ్ దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్‌ను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం కరీంనగర్‌లోని ఆయన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీపీని సస్పెండ్ చేసేవరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి చెందుతారనే భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని సస్పెండ్ చేయడంతో పాటు అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story